ఈ రోజు ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా, మల్లికమల గ్రామంలోని శ్రీ కాశీ రెడ్డి నాయన అవదూత ఆలయానికి
చేరుకున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర : 05.12.2022
తేది:05.12.2022, సోమవారం, మల్లికమల.
**** ***** *****
*తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలి -*
శ్రీ శ్రీ శ్రీ విజయ శంకర స్వామి
జాతీయ అధ్యక్షులు, అన్నమయ్య గృహ సాధన సమితి
**** ***** *****
తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాన్ని, అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్, అన్నమయ్య గృహసాధన సమితి సంయుక్త అధ్వర్యంలో అంతర్వేది నుండి తిరుమల కొండ వరకు, 11లక్షల యాబై వేల సంతకాలతో, రెండు నెలల నుండి జరుగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర ఈ రోజు ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా, మల్లికమల గ్రామంలోని శ్రీ శ్రీ కాశీ రెడ్డి నాయన అవదూత ఆలయానికి చేరుకుంది.
జానపద వృత్తి కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజు అధ్వర్యంలో భజన కళాకారుల బృందాలు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు, అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ శ్రీ శ్రీ విజయ శంకర స్వామికి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ శ్రీ ప్రసన్న లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు, అన్నమయ్య గృహ సాధన సమితి, జై భారత్ సేకరించిన 11 లక్షల యాబై వేల సంతకాలకు పూజలు నిర్వహించారు.
అనంతరం జరిగిన సమావేశంలో అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ విజయశంకర స్వామి మాట్లాడుతూ తెలుగు భాషకు ప్రాణం పోసిన తొలి వాగ్గేయకారులు తాళ్ళపాక అన్నమాచార్యులు అని అన్నారు. 2003లో తిరుమలకొండపై కూల్చేసిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయ విగ్రహాన్ని యథాస్థానంలో టీటీడీ బోర్డు వెంటనే నిర్మించాలనీ డిమాండ్ చేశారు. తిరుమల కొండపై అన్నమయ్యకు జరిగిన అపచారంపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని భక్తులను కోరారు. అన్నమయ్య గృహ సాధన ఉద్యమంలో,పదకొండు లక్షల యాభై వేల సంతకాల సేకరణలో జైభారత్ పాత్ర ముఖ్యమైనది అని అన్నారు.
అన్నమయ్య గృహ సాధన సమితి రాష్ట్ర ప్రధాన ఖదిజ్ఞాసి యం.త్రిమూర్తులు మాట్లాడుతూ
తెలుగు భాషకు ప్రాణం పోసిన తొలి వాగ్గేయకారులు తాళ్ళపాక అన్నమాచార్యులు అని అన్నారు. 14 వ శతాబ్దంలోనే సామాజిక అసమానతలపైన, వివక్ష పైన సంస్కరణ కోసం సంకీర్తనల రూపంలో సామాజిక మార్పుకి కృషి చేసిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య అని అన్నారు. తిరుమల కొండపై అన్నమయ్య గృహాన్ని నిర్మించే వరకు, విగ్రహాన్ని ప్రతిష్టించే వరకు జైభారత్ తరపున మరింత ఉదృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. టీటీడీ బోర్డు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
జైభారత్ జాతీయ కార్యదర్శులు ఖదిజ్ఞాసి అరవిన్సర విన్ సర్కార్, ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి చౌడవరపు వంశీ, రాష్ట్ర కార్యదర్శులు ఖదిజ్ఞాసి జి కుళ్ళయప్ప, ఖదిజ్ఞాసి గురు గోవింద్ కుళ్ళయప్ప, జైభారత్ రాష్ట్ర నాయకులు ఖదిజ్ఞాసి రాఘవదాస్, ఖదిజ్ఞాసి సూర్యసేన్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
యం.త్రిమూర్తులు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య గృహ సాధన సమితి
ఆంధ్రప్రదేశ్